ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఓ బంగారు బాబు దర్శనమిచ్చాడు. యాదగిరిగుట్ట ప్రధాన రహదారి వెంట ఒంటి నిండా బంగారంతో ఓ వ్యక్తి సంచరిస్తూ కనిపించాడు. హోటల్లో టీ తాగుతూ స్థానికులను పలకరించాడు. ఎవరీ బంగారు బాబు అని అరా తీయగా... హైదరాబాద్ పాత బస్తీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి శ్రావణ్ అని తెలుసుకున్నారు. ఒంటి మీద సుమారు 5 కిలోల బంగారంతో జిగేలుమంటున్న శ్రావణ్‌తో సెల్ఫీ తీసుకునేందుకు జనాలు ఆసక్తి చూపారు. రజక సంఘ నాయకునిగా ఉన్న శ్రావణ్... యాదగిరిగుట్టలో అన్నదాన సత్ర భవనం భూసేకరణకు వచ్చానని తెలిపారు.
యాదగిరిగుట్టలో 'బంగారు బాబు'..చూస్తే ఔరా అంటారు.. - BHUVANAGIRI
ఏదైనా పేరంటానికో, పెళ్లికో వెళ్తున్నామంటే చాలు ఒంటి నిండా నగలతో ముస్తాబవుతారు మగువలు. కానీ ఇక్కడో వ్యక్తి ఒంటి మీద సుమారు 5 కిలోల బంగారంతో జిగేల్మంటూ... అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
GOLD MAN IN YADHAGIRIGUTTA