మహత్మాగాధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపుతో... యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా ఆద్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర మోత్కూరుకు చేరుకుంది. గాంధీజీ కలలు కన్న రాజ్యం, ప్లాస్టిక్ రహిత దేశాన్ని నిర్మించడం కోసం... భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 13 రోజులుగా యాత్ర కొనసాగిస్తున్నట్లు జిల్లా భాజపా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను నిషేధించి, కాగితపు కవర్లు, సంచులు వాడేందుకు నడుం బిగించాలని కోరారు.
మోత్కూరుకు చేరిన గాంధీ సంకల్పయాత్ర - gandhi sankalpa yathra reached to mothkur
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు పరిధిలో... భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర మోత్కూరు పట్టణానికి చేరుకుంది. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం ప్లాస్టిక్‌ను నిషేధించాలని నేతలు కోరారు.
మోత్కూరుకు చేరిన గాంధీ సంకల్పయాత్ర