యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో కరోనా కారణంగా ఆదాయంలేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు గణమాస్ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. గ్రామంలోని రెండు వందల కుటుంబాలకు సుమారు రెండు లక్షలు విలువచేసే నిత్యవసర వస్తువులను సంస్థ సభ్యులు పంపిణీ చేశారు.
'కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం ఆనందంగా ఉంది' - నేత కార్మికులకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేసిన గణమాస్ స్వచ్ఛంద సంస్థ
కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం చాలా ఆనందంగా ఉందని గణమాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతోన్న రెండు వందల చేనేత కుటుంబాలకు నిత్యవసర వసువులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో గణమాస్ సంస్థ ద్వారా ప్రతిరోజు 200 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశామని తెలిపారు. హైదరాబాద్లోనే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఒక్కో కుటుంబానికి సుమారు వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను అందిస్తున్నామని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కల్యాణి, భార్గవ్, మధు, హరిక, రవీందర్ రెడ్డి, సంగీతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:CJI JUSTICE NV RAMANA: సీజేఐతో ఎస్ఈసీ.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఇష్టాగోష్ఠి.!