యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చిన భక్తులు లక్ష్మీనరసింహులను దర్శించుకుని తరిస్తున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి - భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి
సెలవు రోజు కావడం వల్ల కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్రంలో సందడి పెరిగింది.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి