యాదాద్రి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గిరిబాబు ఇటీవల కరోనాతో మృతి చెందారు. బాల్యంలో అతనితో కలిసి చదువుకున్న పదోతరగతి మిత్రులు.. స్నేహితుడి కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ బృందంగా ఏర్పడి.. ఇతర స్నేహితులు, బంధుమిత్రుల ద్వారా సమకూర్చిన రూ. 1,60,500లను మృతుడి భార్యా పిల్లలకు అందజేశారు.
మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు - అండగా నిలిచిన స్నేహితులు
యాదాద్రి జిల్లా వలిగొండ పట్టణంలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి.. స్నేహితులు అండగా నిలిచారు. నగదు సాయంతో పాటు మిత్రుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
financial assistance
నగదు సాయంతో పాటు స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు.. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:corona deaths: కరోనా కల్లోలం.. మే నెలలో మరణ మృదంగం