ఆలేరు పోలీసు స్టేషన్లో ఉచిత మెడికల్ క్యాంపు - Medical Camp at Arular Police Station
పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేక అనారోగ్యానికి గురవుతున్నారని యాదగిరిగుట్ట ఏసీపీ నరసింహ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆలేరు పోలీసు స్టేషన్లో ఉచిత మెడికల్ క్యాంపు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీసుస్టేషన్లో ఉచిత మెడికల్ క్యాంపును ఏసీపీ నరసింహ రెడ్డి ప్రారంభించారు. పోలీసులు ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీసులు విధి నిర్వహణలో సమయం లేకపోవడం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోలేకపోతున్నారనే విషయాన్ని గుర్తించి... పోలీసు స్టేషన్లోనే ఉచిత వ్తెద్య పరీక్షలు చేయిస్తామన్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యులుంటే మందులు, శస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు.