ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో యాదాద్రి జల్లా పోచంపల్లి-కొత్తగూడెం మధ్య వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఇందులో 42 మంది ప్రయాణిస్తున్నారు. అయితే వరద ప్రవాహం వల్ల బస్సు దిగి గట్టుమీదకు చేరుకున్నారు. చుట్టూ నీరు ఉండటం వల్ల ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ దిల్సుఖ్నగర్ నుంచి పోచంపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వరదలో చిక్కుకున్న ప్రయాణికులు.. 40 మంది సేఫ్ - ప్రయాణికులు సురక్షితం వార్తలు యాదాద్రి జిల్లా
తెలంగాణలో కురుస్తున్న జనజీవనం ఎక్కడికక్కడా స్తంభించిపోయింది. యాదాద్రి జిల్లా పోచంపల్లి-కొత్తగూడెం మధ్య వాగులో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఇందులోని 40 మంది ప్రయాణికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
వరదలో చిక్కుకున్న ప్రయాణికులు.. 40 మంది సేఫ్
సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 40 మందిని పిల్ల బాటల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరద ప్రవాహ వేగానికి పెద్దల మైసమ్మ (42), భోగ వైష్ణవి (18) గల్లంతయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.
ఇదీ చదవండి:వరదలో చిక్కుకుపోయిన 35 మంది.. కాపాడేందుకు అధికారుల చర్యలు