యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం గట్టు సింగారంలో పిచ్చి కుక్క నలుగురిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలు మద్ది లింగమ్మ పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. గ్రామంలోని నాలుగు గేదెలనూ కరవడం గమనించిన గ్రామస్థులు పిచ్చికుక్కను వెంబడించి చంపారు. పక్క గ్రామమైన మానాయికుంటలోనూ దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు.
పిచ్చి కుక్క దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు.. - Yadadhri Bhuvanagiri District latest news
ఓ పిచ్చికుక్క నలుగురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటన భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలోని గట్టు సింగారంలో చోటు చేసుకుంది.
Breaking News