కరెంట్ షాక్తో పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు - former died in fields
భూమినే నమ్ముకున్న అన్నదాత ఆ పొలంలోనే కన్నుమూశాడు. పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లి తుదిశ్వాస విడిచాడు. పెద్దగూడ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

కరెంట్ షాక్తో పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు
విద్యాదాఘాతానికి రైతు బలయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పెద్దగూడకు చెందిన కందగట్ల బాల్రెడ్డి(45) రైతు. అతనికున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే వరి పొలానికి నీళ్లు పెట్టడానికి పొలానికి వెళ్లాడు. మోటారు స్విచ్ వేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. బాల్రెడ్డికి భార్యతోపాటు కొడుకు, కూతురు ఉన్నారు. అనుకోని ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
TAGGED:
former died in fields