యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ ఆవరణం అంతా నీటితో నిండిపోయింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. భువనగిరి ఏకశిలా కొండ నుంచి నీళ్లు కిందకి పారుతూ... జలపాతంలా కనువిందు చేస్తోంది.
భారీ వర్షంతో జలమయమైన రోడ్లు - యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పండుగ సెలవులకు ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షంతో జలమయమైన రోడ్లు