తెలంగాణ

telangana

ETV Bharat / state

Fire at Anji Reddy Theater: బంగార్రాజు షో నడుస్తుండగా... అకస్మాత్తుగా మంటలు - Choutuppal Anji Reddy Theater News

Fire at Anji Reddy Theater: థియేటర్​లో బంగార్రాజు సినిమా నడుస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో చోటుచేసుకుంది. అయితే థియేటర్ లోపలికి మంటలు రాకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

Anji Reddy
Anji Reddy

By

Published : Jan 24, 2022, 3:33 PM IST

బంగార్రాజు షో నడుస్తుండగా... అకస్మాత్తుగా మంటలు

Fire at Anji Reddy Theater: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్​లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సినిమా థియేటర్​ ఆవరణలో ఉన్న పాత ఫర్నీచర్​కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం సమయంలో థియేటర్​లో ఉన్న ప్రేక్షకులను బయటకు పంపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు సిగిరెట్ తాగి నిర్లక్ష్యంగా ఫర్నీచర్ వైపు పడవేయడం వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని థియేటర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. మంటలు థియేటర్​లోకి వెళ్లకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకురావడంలో సహాయపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Platform Ticket Price : భారీగా పెరిగిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలు

ABOUT THE AUTHOR

...view details