వలిగొండ మండలం వెంకటాపురంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట సమీపంలో ఉన్న ఎత్తైన సూది కొండ గుట్టపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎండాకాలం కావడం వల్ల గుట్టపై మంటలు ఎగసి పడ్డాయి. స్థానిక రైతులు ఆ మంటలను ఆర్పేశారు. దీంతో స్థానికులు ఊపరి పీల్చుకున్నారు. ఈ ఎత్తైన సూది కొండ గుట్టపై ఎవరూ ఉండరు. గుట్టపైకి వెళ్ళడానికి సరైన దారి కూడా లేదు.
సూదికొండ గుట్టపై మంటలు... అదుపు చేసిన రైతులు - శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట సమీపంలో ఉన్న సూది కొండ గుట్టపై మంటలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట సమీపంలో ఉన్న ఎత్తైన సూది కొండ గుట్టపై మంటలు చెలరేగాయి.
సూది కొండ గుట్టపై మంటలు... అదుపు చేసిన రైతులు