యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో బీఏఎఫ్ ఫర్నిచర్ తయారీ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డోర్లు, ఫ్రేమ్ ఇతర ఫర్నీచర్ సామగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. 60 లక్షల ఆస్తి నష్టం - యాదాద్రి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి జిల్లా కొండమడుగు శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్ సామగ్రి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు.
పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. 60 లక్షల ఆస్తి నష్టం
ఈ సంఘటనా సుమారు 60 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బీఏఎఫ్ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు