తెలంగాణ

telangana

ETV Bharat / state

చౌటుప్పల్​లోని కట్టెల పరిశ్రమలో అగ్ని ప్రమాదం - చౌటుప్పల్​లోని కట్టెల పరిశ్రమలో అగ్ని ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో అగ్ని ప్రమాదం జరిగింది. కట్టెల పరిశ్రమలో మంటలు చెలరేగి భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పక్క పక్కనే పరిశ్రమలు ఉండటం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

fire-accident-in-timber-industry

By

Published : May 3, 2019, 9:42 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం ఆరేగూడెంలోని ఎస్​ ఆర్​ ఎం ఎంటర్​ప్రైజెస్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో కట్టెల పరిశ్రమ తగలబడింది. తెల్లవారుజామున మూడో నంబరు పరిశ్రమలో చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించాయి. పొడివాతావరణం వల్ల అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. నాలుగో నంబరు పరిశ్రమకు వ్యాపించాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్​ ఇంజిన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. దీనికి సమీపంలోని రసాయన పరిశ్రమ ఉండడం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

చౌటుప్పల్​లోని కట్టెల పరిశ్రమలో అగ్ని ప్రమాదం
ఇదీ చదవండి: చిరంజీవి ఫాంహౌస్​లో అగ్ని ప్రమాదం.. మంటల్లో సైరా సెట్​ ​

ABOUT THE AUTHOR

...view details