తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపసర్పంచ్​ జామాయిల్​ తోటలో మంటలు - FIRE ACCIDENT NEWS IN TELANGANA

ప్రమాదవశాత్తు జామాయిల్​తోటలో మంటలు చెలరేగగా... స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రమాదాన్ని ప్రాథమిక స్థాయిలో అదుపుచేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా కుర్రారంలో జరిగింది.

FIRE ACCIDENT IN JAMAYIL GARDEN AT KURRARAM
FIRE ACCIDENT IN JAMAYIL GARDEN AT KURRARAM

By

Published : Feb 20, 2020, 8:02 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారంలో అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డికి చెందిన సుమారు 4 ఎకరాల జామాయిల్ తోటలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించగా... హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. వెంటనే స్పందించటం వల్ల పంట పెద్దగా నష్టపోలేదని స్థానికులు తెలిపారు.

ఉపసర్పంచ్​ జామాయిల్​ తోటలో మంటలు...

ఇదీ చూడండి:ఆశ్చర్యం: ఓ వైపు శస్త్రచికిత్స.. మరోవైపు వయోలిన్

ABOUT THE AUTHOR

...view details