కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా దుకాణాల యజమానులు నిబంధనలు ఉల్లఘించారని పంచాయతీ అధికారులు ఫైన్ వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో గ్రామ అఖిలపక్ష నాయకులు, దుకాణ యజమానులు ఓ నిర్ణయానికి వచ్చారు.
నిబంధనలు పాటించని రెండు షాపులకు ఫైన్ - Yadadri Bhubaneswar District Atmakuru Latest News
కరోనా వేళ దుకాణ యజమానులు నిబంధనలు పాటించలేదని పంచాయతీ అధికారులు జరిమానా విధించారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది.
నిబంధనలు పాటించని రెండు షాపులకు ఫైన్
దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంచాలని... పాటించని వారికి వేయి రూపాయలు ఫైన్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పట్టణంలో రెండు దుకాణాల యజమానులు నిబంధనలు పాటించలేదని ఆత్మకూరు గ్రామ పంచాయతీ వెయ్యి రూపాయల జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని గ్రామ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ తెలిపారు.
ఇదీ చూడండి :కరోనా రోగులకు వైద్యం అందడం లేదు: భట్టి