పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినికి మోత్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పోచం నారాయణ ఆర్థిక సాయం అందజేశారు. దాతల సాయం ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి... పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలోని భారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు దామోదర్ రాయుడు, కందుకూరి సుధాకర్ సౌజన్యంతో 2019 -20లో పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థిని శ్యామల ఉన్నత చదువుల కోసం రూ.33 వేల చెక్కును అందజేశారు.
ఉన్నత చదువుల కోసం పేద విద్యార్థినికి ఆర్థిక సాయం - తెలంగాణ వార్తలు
పదో తరగతి పూర్తి చేసిన ఓ పేద విద్యార్థికి మోత్కూరు ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పోచం నారాయణ ఆర్థిక సాయం చేశారు. ఉన్నత చదువులు చదివి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఉన్నత చదువుల కోసం పేద విద్యార్థినికి ఆర్థిక సాయం
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి.అంజయ్య, సంఘ ప్రధాన కార్యదర్శి గుజ్జ నరసయ్య, కార్యవర్గ సభ్యులు మొగులపల్లి సోమయ్య, పాఠశాల ఉపాధ్యాయులు గాదె వెంకటేశ్వర్లు, నిజాం ప్రవీణ్ కుమార్, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు.