రైతులకు యూరియా ఇక్కట్లు తప్పడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. పీఏసీఎస్కి గురువారం 400 యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకున్న అన్నదాతలు పెద్ద ఎత్తున తరలొచ్చారు.
భౌతిక దూరం లేకుండా యూరియా కోసం రైతుల బారులు - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా అన్నదాతలు యూరియా కోసం వేచి చూశారు.
యూరియా కోసం రైతుల బారులు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యూరియా కోసం రైతులు భౌతిక దూరం పాటించకుండా లైన్ కట్టారు. కొంత మంది మాస్కులు కూడా కట్టుకోలేదు. వలిగొండలో మొన్న ఏడుగురికి కరోనా నిర్ధరణయింది. అయినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పీఏసీఎస్ వద్ద కనీసం సానిటైజర్ కూడా అందుబాటులో ఉంచలేదని రైతులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:-ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు