లాక్డౌన్(Lock down) విధించడంతో పనులు లేక చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలించిపోయిన హైదరాబాద్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ పి.నిహారిక రెడ్డి(Fashion Designer P. Niharika Reddy) భూదాన్ పోచంపల్లిలో 350 మంది చేనేత కుటుంబాలకు… రూ.3 వేల రూపాయల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశారు.
Fashion Designer: 350 కుటుంబాలకు సాయం
లాక్డౌన్(Lock down) కారణంగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులకు... హైదరాబాద్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ పి.నిహారిక రెడ్డి(Fashion Designer P. Niharika Reddy) అండగా నిలిచారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 350 మంది చేనేత కుటుంబాలకు ఆమె సాయం చేసి చేయూతనిచ్చారు.
essentials Distribution: 350 కుటుంబాలకు సాయం
కరోనా వల్ల మనిషి మనిషికి దూరం కానీ... మనసుకు దూరం కాదని ఈ సందర్భంగా నిహారిక రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాలని కోరారు. కొంత మంది కొవిడ్ వచ్చి కోలుకున్న వారు కూడా పూట గడవని స్థితిలో ఉన్నారని తెలిపారు. అలాంటి వారికి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పుడ్ సప్లై చేయడం జరుగుతుందని నిహారిక రెడ్డి వెల్లడించారు.