తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు' - తెలంగాణ వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు ఆరోపించారు. తూకం విషయంలో తాము నష్టపోతున్నామని వాపోయారు. తాలు, తేమ శాతం పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

farmers unhappy on vadaparthy grain purchase centers, farmers protest
రైతుల ఆందోళన, ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై రైతుల ధర్నా

By

Published : May 5, 2021, 2:35 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పనితీరుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఒక కిలో ధాన్యం అదనంగా తూకం వేయడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాలు, తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. రైతుల ధర్నాకి నాగినేనిపల్లి ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ధర్నాతో ఇరు వైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇదీ చదవండి:'కరోనా విషయంలో భారత్​కు మద్దతుగా నిలువొద్దు'

ABOUT THE AUTHOR

...view details