యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన వరి రైతులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులను, విత్తన దుకాణాల యాజమాన్యాలను ప్రశ్నిస్తే వాతావరణ మార్పులంటున్నారని నిరసన తెలిపారు.
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రైతుల నిరసన తాళుగా మరిందని..
మండలంలో గత సంవత్సరం కాలం లేక.. ఈసారి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయని వరి సాగు చేస్తే త్వరగా భూగర్బ జలాలు అడుగంటి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొంత ఎండిపోగా మిగిలినదైనా దక్కుతుందనుకుంటే తీరా నోటికాడికొచ్చే సమయంలో తాళుగా మరిందని వాపోయారు.
చేతులు దులుపుకుంటున్నారు..
పంట ఎక్కువ వస్తుందని ఆశతో బయోసీడ్ 799 కంపెనీ హైబ్రిడ్ వంగడాలు కొనుగోలు చేసి సాగు చేస్తే చేతికి వచ్చే సమయంలో వరి కంకిలా ఉండడం నిరాశ కలిగించిందన్నారు. తీరా పరిశీలిస్తే గింజలు లేక తాళుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మాయ మాటలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోవాలి..
సంబంధిత విత్తనాల కంపెనీలు, దుకాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించాలని.. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బయోసీడ్ 799 హైబ్రిడ్ వంగడాలతో కేవలం ఆత్మకూరు మండలంలోనే సుమారుగా 8 వేల ఎకరాల్లో సాగైంది.
ఇదీ చూడండి:వ్యవసాయక్షేత్రమైన ఇల్లు... మిద్దె సేద్యంతో ఆకట్టుకుంటున్న ఇల్లాలు