తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులపై కేసు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలి' - ఎస్సైని సస్పెండ్ చేయాలి

రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసి, ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపూర్ పోలీస్ స్టేషన్​ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.

farmers protest for want to si suspended
'రైతులపై కేసు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలి'

By

Published : Dec 25, 2019, 5:46 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ పోలీస్ స్టేషన్ ముందు అరేగుదాం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రైతులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని కొంతమంది రైతులకు, వేం నరేందర్ రెడ్డి అనే రైతుకు మధ్య భూవివాదాలు ఉన్నాయి. రైతులపై కేసులు నమోదు చేయటంతో కాశయ్య అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రైతును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలని గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ వరకు ర్యాలీ తీశారు. అనంతరం ధర్నా చేపట్టారు.

'రైతులపై కేసు పెట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలి'

ABOUT THE AUTHOR

...view details