అర్హులైన రైతులకు కొత్త పట్టా పాసు పుస్తకాలు వెంటనే ఇవ్వాలని జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించారు. సాదా బైనామాలు అమలు చేయాలని, వీఆర్వోల నిర్లక్ష్యం నశించాలని, దొంగ పట్టా పాసుబుక్కులను అరికట్టాలని నినాదాలు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వీఆర్వోలు పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
'అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వాలి' - farmers protest for pass books of land
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని రైతులు పట్టాపాసుపుస్తకాలు ఇవ్వాలంటూ తహశీల్దారు కార్యాలయం ముందు బైఠాయించారు.
!['అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3716733-thumbnail-3x2-vysh.jpg)
అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ నిరసన
అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ నిరసన