యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ధాన్యానికి నిప్పు పెట్టి.. రైతుల నిరసన - Farmers Rastaroko latest news
ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
ధాన్యానికి నిప్పు పెట్టి.. రైతుల నిరసన
కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా... అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో పంట పూర్తిగా నష్టయపోయామని.. మిగిలిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని వాపోయారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.