తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిసి, రంగు మారిన ధాన్యాన్ని కొనాలని రైతుల ధర్నా - తెలంగాణలో రైతుల ధర్నా

తడిసి, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని భూదాన్ పోచంపల్లి పట్టణంలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయిందని, మిగిలిన ధాన్యం తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

farmers protest at bhoodan pochampally in yadadri bhuvanagiri
'తడిసి, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'

By

Published : Nov 23, 2020, 12:23 PM IST

తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని ప్రధాన కూడలిలో రైతులు ధర్నా చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకి పర్రె కాల్వ పొంగటంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయిందని, మిగిలిన ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసి పోచంపల్లి రైతులు నష్టపోయారని, వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ధాన్యాన్ని రోడ్డుపై పోసి, పెట్రోల్ బాటిల్ ముందు పెట్టుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతుల వద్ద నుంచి తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:గ్రేటర్​లో అభ్యర్థుల తీన్​మార్.. హ్యాట్రిక్ కోసం పక్కా స్కెచ్

ABOUT THE AUTHOR

...view details