తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆగ్రహం - తెలంగాణ వార్తలు

తుక్కాపురం ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేయడం లేదని వాపోయారు. అకాల వర్షాలతో పంట నీటిలో నానుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై రైతుల ధర్నా, తుక్కాపురంలో రైతుల ధర్నా

By

Published : May 8, 2021, 5:13 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి చాలా రోజులు గడుస్తున్నా జాప్యం చేస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. ఐకేపీ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భువనగిరి-నల్లగొండ ప్రధాన రహదారిపై ధాన్యం రాశులు పోసి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని... మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం నీటి పాలవుతోందని రైతులు వాపోయారు.

రాత్రి, పగలు తేడా లేకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోందని అన్నారు. రైతుల ధర్నాతో ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్, వ్యవసాయ అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:డీఆర్​డీఓ కొవిడ్​ ఔషధానికి డీసీజీఐ అనుమతి

ABOUT THE AUTHOR

...view details