తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ 93మంది రైతులకు వెంటనే పాస్​పుస్తకాలు ఇవ్వాలి' - మాటూరు గ్రామ రైతలు పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా మాటూరు గ్రామంలోని సర్వే నంబర్ 332 భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న తమకు పట్టాపుస్తకాలు ఇవ్వాలంటూ రైతులు పాదయాత్ర నిర్వహించారు. వీరికి మద్దతుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

farmers-padayatra-at-maturu-village-in-yadadri-bhuvanagiri-district
'ఆ 93మంది రైతులకు వెంటనే పాస్​పుస్తకాలు ఇవ్వాలి'

By

Published : Oct 1, 2020, 12:00 PM IST

యాాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటారు గ్రామంలో 70ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాపాసుపుస్తకాలు ఇవ్వకపోడవం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. మాటారు నుంచి మోటకొండూరు తహసీల్దార్​ కార్యాలయం వరకు నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

332 సర్వే నంబర్​లోని 78 ఎకరాల 33 గుంటల భూమిని ఎన్నోఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న 93 దళిత కుటుంబాలకు వెంటనే నూతన పాస్​బుక్​లు ఇవ్వాలని వారు డిమాండ్​ చేశారు. గతంలోనూ ఈ భూమి విషయమై ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసికెళ్లామని.. అయినా ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాస్​పుస్తకాలు ఇవ్వాలని లేని ఎడల పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు, జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్, తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఫార్మాసిటీకి ఆటంకాలు.. ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

ABOUT THE AUTHOR

...view details