యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, ఆలేరు, రాజపేట, మోటకొండూరు మండలాల్లోని గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉక్కపోతగా ఉన్న ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. చిరుజల్లులు పడుతూ ఈదురుగాలులు వీచి ఆలేరులో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. వాహనదారులకు కాస్త రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి దాన్ని పక్కకు తొలగించారు.
యాదాద్రిలో వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం - యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. పలు చోట్ల చెట్లు విరిగిపడి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ ఈ వర్షాలతో తమ పంటలకు మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
yadadri
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న తేలికపాటి చిరుజల్లులకు రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభంలోనే పత్తి విత్తనాలు వేసినా.. మొలకెత్తని చోట్ల మళ్లీ నాటుతున్నారు. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు ఆనందపడుతున్నారు.