యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పెద్దవాగు పారి బావులు, బోర్లలోకి నీళ్లు వచ్చాయి. దీంతో వాగు పరివాహక ప్రాంతాల రైతులు వ్యవసాయం చేసుకునేందుకు వీలు కలిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
16 ఏళ్ల తర్వాత పొంగిన కొలనుపాక.. సంతోషంలో రైతులు - farmers happy as there are full water in kolanupaka
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పెద్దవాగు పొంగిపొర్లగా.. పరివాహక ప్రాంతాల రైతులు ఆనందంలో మునిగిపోయారు.16 ఏళ్ల తర్వాత వాగు పొంగగా.. ఉప సర్పంచ్ అనిత స్వయంగా నాట్లు వేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
![16 ఏళ్ల తర్వాత పొంగిన కొలనుపాక.. సంతోషంలో రైతులు farmers happy as there are full water in kolanupaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8572183-716-8572183-1598491308083.jpg)
16 ఏళ్ల తర్వాత పొంగిన కొలనుపాక.. సంతోషంలో రైతులు
జిల్లాలోని కొలనుపాకలో గతంలో పది బోర్లు వేసిన నీళ్లు రాలేదని... 16 సంవత్సరాలుగా రాని వాగు.. ఈ సారి పొంగాయంటూ ఉప సర్పంచ్ అనిత ఆనందం వ్యక్తం చేశారు. స్వయంగా ఆమె పొలంలో నాట్లు వేశారు.
ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'
TAGGED:
నాట్లు వేసిన ఉపసర్పంచ్ అనిచ