తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2021, 4:12 PM IST

ETV Bharat / state

'15 రోజులు అవుతున్నా కాంటా ఏర్పాటు చేయలేదు'

యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్​కి తెచ్చి 15 రోజులు అవుతున్నా ఇంత వరకు కాంటా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

Maryala village news, ikp news, Yadadri Bhuvanagiri district
Maryala village news, ikp news, Yadadri Bhuvanagiri district

యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేయడం లేదని రైతులు అధికారులపై మండిపడ్డారు. బొమ్మల రామారం మండలంలోని మర్యాల గ్రామంలోని ఐకేపీ సెంటర్​ వద్ద రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ సెంటర్​కి తెచ్చి 15 రోజులు అవుతున్నా కాంటా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు తెలిపారు.

తొందరగా కాంటా ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. లేనియెడల తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో నేలపాలు అవుతుందని రైతులు తమ ఆవేదన వెలిబుచ్చారు.

ఇదీ చూడండి:18 ఏళ్లు దాటిన వారి టీకా ఖర్చు రూ.67,193 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details