పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పరిషత్ కార్యాలయం ముందు చోటు చేసుకుంది. మట్టగజం యాకయ్య అనే రైతుకు చెందిన రెండకరాల భూమికి రైతుబంధు డబ్బులు వేరే రైతు అకౌంట్లో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అలా మూడు సార్లు జరిగిందని వాపోయారు.
నా రైతు బంధు నాకు ఇప్పించండి...లేదా పురుగుల మందే గతి - నా రైతు బంధు నాకు ఇప్పించండి...లేదా పురుగుల మందే గతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ రైతు తన రెండెకరాలకు సంబంధించి రైతు బంధు నిధులు ఇతరుల అకౌంట్లో జమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన డబ్బులు తనకు ఇప్పించాలని ఎంపీపీ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు.
ఇతర రైతుల ఖాతాలో పడుతోన్న నా డబ్బులు ఇప్పించండి : బాధితుడు
సదరు రైతును తన డబ్బులు ఇచ్చేయమని ఎన్నిసార్లు అడిగినా స్పందించట్లేదన్నారు. ఈ క్రమంలో తన డబ్బులు తనకు ఇప్పించమని మండల పరిషత్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బా పట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగాడు.
ఇవీ చూడండి : అక్రమంగా గంజాయి రవాణా.. విద్యార్థులే ముఠా లక్ష్యం
TAGGED:
raithu nirasana