తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రితో ప్రణబ్​ ముఖర్జీకి ప్రత్యేక అనుబంధం - యాదాద్రిలో ప్రణబ్ ముఖర్జీ

కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి... యాదాద్రి ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2015 జులై 5న ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

farmer president of india pranab mukharjee visit yadadri laxminarsimha swamy temple
యాదాద్రితో ప్రణబ్​ ముఖర్జీకి ప్రత్యేక అనుబంధం

By

Published : Sep 1, 2020, 6:40 AM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రితో... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్రపతి హోదాలో ప్రణబ్... ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. 2015 జులై 5న యాదాద్రికి చేరుకుని... ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలించారు. అపురూప నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్​ను... ప్రత్యేకంగా అభినందించారు.

కొండ పరిసర ప్రాంతాల్లోని నవగిరులతోపాటు... ఆలయ ప్రాశస్త్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కట్టడాల తీరుపై శిల్పి ఆనంద్ సాయి... ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా నాటి రాష్ట్రపతికి వివరించారు. స్వామి వారికి ఆరగింపుగా నివేదించే కట్టె పొంగలిని ఇష్టంగా స్వీకరించిన ప్రణబ్... ప్రసాదం తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారని ఆలయ సిబ్బంది గుర్తు చేసుకున్నారు.

ప్రణబ్​ స్మరణ: 7 రోజులు సంతాప దినాలు

ABOUT THE AUTHOR

...view details