యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజన్నగూడెంలో కరెంట్ షాక్తో రావుల శేఖర్ రెడ్డి అనే రైతు మృతి చెందాడు. తన పొలంలో మోటార్ నడవట్లేదని పొలానికి నీరు పెట్టేందుకు స్టాటర్ను బాగు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విద్యుత్ షాక్తో రైతు మృతి - Farmer Died due to Current Shock in yadadri district
యాదాద్రి భువనగిరి జిల్లా రాజన్నగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్తో రైతు రావుల శేఖర్ రెడ్డి మృతి చెందాడు. అతని మరణ వార్తతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యుత్ షాక్తో రైతు మృతి
TAGGED:
విద్యుత్ షాక్తో రైతు మృతి