తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్యాన్సీ నెంబర్ కోసం గలాటా.. పోలీసుల జోక్యం - ఫ్యాన్సీ నెంబర్ కేటాయింపులో వివాదం

వాహనాలకు నెంబర్ కేటాయింపులో యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో గలాటా చోటుచేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దమణిగింది.

fancy number disputes in yadadri bhongir transport office
ఫ్యాన్సీ నెంబర్ కోసం గలాటా.. పోలీసుల జోక్యం

By

Published : Nov 7, 2020, 12:23 PM IST

కొత్త వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ పొందే విషయంలో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో గలాటా చోటుచేసుకుంది. నెంబర్ కోసం ఆన్​లైన్​లో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి కాకుండా తర్వాత చేసుకున్న వారికి ఫ్యాన్సీ నెంబర్ ఎలా కేటాయించారని ఏజెంట్లకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా రవాణా అధికారి సురేందర్ రెడ్డి సమాచారాన్ని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్యాలయంలో ఏజెంట్లు, వాహనాల యజమానులను బయటకు పంపించి వివాదం పరిష్కరించారు.

కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాన్ని రిజిస్ట్రేషన్ కోసం గౌతమ్ అనే వ్యక్తి ఫ్యాన్సీ నెంబర్ టీఎస్ 30 జీ 1718 కోసం ఉదయమే దరఖాస్తు చేసుకున్నారు. ఇదే ఫ్యాన్సీ నెంబర్ కోసం సంపత్ కుమార్ తన కొత్త కారు కోసం మధ్యాహ్నం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నెంబర్ కేటాయించాల్సి ఉండగా... సంపత్​కు కేటాయించే ప్రయత్నం చేశారని ఏజెంట్లు ఆరోపించారు.

మోటర్ వెహికల్ ఇన్​స్పెక్టర్ శ్రీకాంత్​ని వివరణ కోరగా... ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకుంటే ఆక్షన్ నిర్వహించాల్సి ఉంటుందని, కానీ బిడ్డింగ్ నుంచి కారు యజమాని తప్పుకోవడం వల్ల... ముందు దరఖాస్తు చేసుకున్న బైక్ యజమాని గౌతమ్​కే కేటాయించినట్టు తెలిపారు. పోలీసులు రంగప్రవేశంతో అధికారులు వెనక్కి తగ్గడం వల్ల అర్హుడికి నెంబర్ దక్కింది.

ఇదీ చూడండి:గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి

ABOUT THE AUTHOR

...view details