యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారిపై యువకుడి మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే యువకుడి ప్రాణం పోయిందని మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆరోపించారు. తుక్కాపూర్ గ్రామంలో పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసే క్రమంలో శివ అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
'విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి యువకుడు బలి' - తెలంగాణ వార్తలు
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు భువనగిరి మండలంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.
మృతదేహంతో ఆందోళన, విద్యుదాఘాతంతో యువకుడు మృతి
ఈ ఆందోళనతో ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా... పోలీసులు, గ్రామస్థులకు స్వల్ప తోపులాట జరిగింది. గ్రామస్థులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. తొలుత విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. తమ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో యువకుడు మృతి