తెలంగాణ

telangana

ETV Bharat / state

TTD: తిరుమలలో దళారుల చేతిలో మోసపోయిన యాదాద్రి భువనగిరి జిల్లా భక్తులు

తిరుమలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భక్తులను దళారులు మోసం చేశారు. తితిదే ఛైర్మన్‌ కార్యాలయం నుంచి అంటూ నకిలీ సిఫార్సు సందేశాలను పంపి మోసగించారు. మోసపోయామని గుర్తించిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు దళారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

TTD
తితిదే

By

Published : Sep 23, 2021, 3:06 PM IST

తిరుమలలో దళారులు రోజు రోజుకూ కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భక్తులకు తితిదే ఛైర్మన్‌ కార్యాలయం నుంచి అంటూ నకిలీ సిఫార్సు సందేశాలను పంపి మోసగించారు. 11 మంది భక్తులకు దర్శనం కల్పిస్తామని... 16వేల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు.

దళారుల మాటలు నమ్మిన భక్తులు తొలుత 8 వేల రూపాయలు ఫోన్‌ పే చేశారు. దళారులు పంపిన సిఫార్సు సందేశంతో ఛైర్మన్‌ కార్యాలయానికి చేరుకున్న భక్తులు తితిదే సిబ్బందిని సంప్రదించగా నకిలీ సిఫార్సు సందేశంగా తేలింది. మోసపోయామని గుర్తించిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు దళారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: Facebook fake account: ఫేస్​బుక్​లో ప్రొఫెసర్ అసభ్యకర పోస్టులు.. చివరికి...

ABOUT THE AUTHOR

...view details