యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లి గ్రామంలో సెప్టెంబర్ 13న జరిపిన గుప్తనిధుల త్రవ్వకాల కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు నిందితులుగా పట్టుబడటం కొసమెరుపు. మరో నలుగురిని అరెస్ట్ చేయగా ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఖాకీల గుప్తనిధుల వేట.. అడ్డంగా దొరికిన ముఠా.. - గుప్తనిధుల తవ్వకాల్లో పట్టుబడ్డ పోలీసులు
గుప్తనిధుల తవ్వకాల్లో పట్టుబడ్డ పోలీసులు. మీరు విన్నది నిజమే ఈ కేసులో ఖాకీలే కేడీలు. నేరాలకు పాల్పడితే ఎవ్వరైనా ఊచలు లెక్కించాల్సిందే అనడానికి ఇదే ఉదహరణ.
తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామ శివారులో శిథిలావస్థలో ఉన్న అంజనేయ విగ్రహాల వద్ద సెప్టెంబర్ 13న గుప్తనిధుల తవ్వకాలు జరిపారు. భూ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితులను విచారించగా ముగ్గురు పోలీసులు ఎరుకాల రామకృష్ణ(హోంగార్డు ఫైర్ స్టేషన్ భువనగిరి), శ్రీనివాస్ రెడ్డి(హెడ్ కానిస్టేబుల్ చౌటుప్పల్), ప్రభాకర్(కానిస్టేబుల్ మోటకొండూరు)తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్న కష్టాలు