వరంగల్ కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షించేందుకు వెళ్తుండగా... మార్గం మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఖండించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న క్రమంలో భాజపా నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు విజయరామారావును యాదాద్రి జిల్లా ఆలేరు శివారులో అరెస్ట్ చేసిన పోలీసులు... బొమ్మలరామరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌కు కేవలం ఎన్నికల సమీక్షలో భాగంగా మాత్రమే వెళ్తున్నామని.. మిగతా పార్టీల వారిలా రౌడీయిజం చేయడానికి వెళ్లడం లేదని జితేందర్‌రెడ్డి మండిపడ్డారు.
'రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా భాజపాదే గెలుపు' - మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అరెస్ట్
వరంగల్ వెళ్తున్న భాజపా నాయకులను పోలీసులు యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఎన్నికలపై సమీక్షించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేయటాన్ని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా భాజపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ex mp jithender reddy fire on trs government for arresting at aleru
భాజాపా అంటే తెరాసకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినెలా తెరాస ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెరాస కార్యకర్తలు తలుచుకుంటే గల్లీల్లో భాజపా నేతలు తిరగలేరని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతున్నారని.. అదే తాము తలుచుకుంటే 29 రాష్ట్రాలు కదిలివస్తాయన్నారు. సరైన సమయానికి ఎన్నికలు నిర్వహించి తీరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా భాజపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.