యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో చేనేత కార్మికుల చేపడుతున్న దీక్షకు మాజీ ఎంపీ ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. కరోనా మహమ్మరి విజృంభిస్తోన్న నాటి నుంచి చేనేత కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయన్నారు.
నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎంపీ - చేనేత కార్మికుల నిరసనకు మద్ధతు తెలిపిన మాజీ ఎంపీ ఆనంద భాస్కర్
రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు చేపడుతున్న రిలే నిరహాదీక్ష పదో రోజుకు చేరుకుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిరసన చేపడుతున్న నేతన్నలకు మద్దతు తెలిపారు.
![నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎంపీ ex mp Anand Bhaskar supporting the handloom workers' protest in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8183046-501-8183046-1595776549298.jpg)
నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎంపీ
నేసిన బట్టలు అమ్ముడుపోక చేనేత ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయని వాటిని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోనాలని ఆయన డిమాండ్ చేశారు. తాను రాష్ట్రం మొత్తం పర్యటించి చేనేత కార్మికుల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని కేంద్రానికి తెలపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ హ్యాండ్లూం బోర్డు మాజీ సభ్యులు కర్నాటి ధనుంజేయులు , తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.