భువనగిరి తెరాస ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తరఫున మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రజల్ని ఆగం చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా వారి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు ప్రభాకర్ రెడ్డి. ఊరూరా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి బూర నర్సయ్య గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'అన్నదమ్ములిద్దరూ ప్రజల్ని ఆగం చేస్తున్నరు' - KUSUKUNTLA PRABHAKAR
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో తెరాస నేతలు ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి బూర నర్సయ్య గౌడ్‌ను గెలిపించాలని కోరారు.
'అన్నదమ్ములిద్దరూ ప్రజల్ని ఆగం చేస్తున్నరు'