తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో భక్తుల సౌకర్యాల కల్పనకు దేవస్థానం కృషి: ఈఓ గీతారెడ్డి

Yadadri Temple: యాదాద్రిలో భక్తుల సౌకర్యాల కల్పనకు దేవస్థానం కృషి చేస్తున్నట్టు ఈఓ గీతారెడ్డి తెలిపారు. ఈ రోజు నుంచి ప్రధానాలయంలోని క్యూలైన్లలో ఏసీలతో పాటు క్యూకాంప్లెక్స్ పక్కన ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ అందుబాటులోనికి రానున్నాయని ఆమె పేర్కొన్నారు.

yadadri
యాదాద్రి

By

Published : Apr 7, 2022, 2:05 PM IST

Yadadri Temple: యాదాద్రి ప్రధాన ఆలయం ప్రారంభం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి వస్తున్నారు. ఇటీవల కొంతమంది భక్తులు సౌకర్యాలు సరిగ్గా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఈవో దేవస్థానంలోని సౌకర్యల కల్పనపై ఒక ప్రకటన విడుదల చేశారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ గీతారెడ్డి తెలిపారు. ఈ రోజు నుంచి ప్రధానాలయంలోని క్యూలైన్లలో ఏసీలతో పాటు క్యూకాంప్లెక్స్ పక్కన ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ అందుబాటులోనికి రానున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఆలయంలో భక్తుల కోసం చలువ పందిర్లు ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. వారంలోగా ఆపనులను పూర్తిచేస్తామన్నారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు నడిచేలా ఏర్పాటు చేశామన్నారు. కల్యాణకట్టలో వసతులు కల్పించామని ఈఓ గీతారెడ్డి తెలియజేశారు. కొండకింద సెంట్రల్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసి.. ఉచిత దర్శనం ఆర్జిత పూజల టిక్కెట్లు ఇస్తున్నామని వెల్లడించారు. లక్ష్మీ పుష్కరిణి వద్ద స్నానపు గదులు, శౌచాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. చరవాణులు భద్రపరుచుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశాం. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో ఫ్యాన్లు, మంచినీరు ఏర్పాటు చేశామని ఈఓ గీతారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: Yadadri Temple: యాదాద్రిలో భక్తులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details