యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. తొలుత మండలంలోని వెల్లంకి గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సిరిపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామన్నపేట మండల కేంద్రంలో రైతు వేదిక, పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రభుత్వం వ్యవసాయనికి ఇస్తున్న ప్రాధాన్యం దేశంలో ఏ రాష్టం ఇవ్వట్లేదని మంత్రి జగదీశ్ అన్నారు. దేశంలో రైతు సంక్షేమం కోసం తెలంగాణ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
త్వరలోనే ఆ కాల్వ...
రైతులకు 24 గంటల కరెంట్, ఏడాదికి ఎకరం పొలానికి రూ.10,000, రైతు భీమా ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. రైతుల్లో చైతన్యం తేవడానికి రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ధర్మారెడ్డిపల్లి కాల్వను త్వరలోనే పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల్లో రామన్నపేట మండల రైతులకు గోదావరి జలాలను అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.
రైతు వేదిక, పశువైద్యశాలకు మంత్రి జగదీశ్ భూమిపూజ ఇవీ చూడండి : 'పరిస్థితి దయనీయంగా ఉంది.. ప్రభుత్వం ఇకనైనా నిద్రలేవాలి'