యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దర్శించుకున్నారు. బాలాలయంలోని ప్రతిష్ఠ మూర్తులను దర్శించుకుని... ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
లక్ష్మి నరసింహ స్వామి సేవలో దేవాదాయ శాఖ కమిషనర్ - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

లక్ష్మి నరసింహ స్వామి సేవలో దేవాదాయ శాఖ కమిషనర్
దర్శనానంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ మాడ వీధులు, క్యూ లైన్లు, ప్రధాన ఆలయం వద్ద ఏర్పాటు చేసిన రథశాల, పరిసరాలకు సంబంధించిన వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆలయ ఈవో గీతా రెడ్డి, ఏఈవో శ్రవణ్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా ఇల్లు లేదు