తెలంగాణ

telangana

యాదాద్రి ఆలయ గోడలపై అద్భుతాల ఆవిష్కరణ

దేశంలోని నారసింహ క్షేత్రాలు ఒక్క చోటే ఉండేలా... యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఎంబాస్ చిత్రాలు రూపుదిద్దే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాలు ఆలయానికి మరింత శోభను తేనున్నట్లు అధికారులు తెలిపారు.

By

Published : Aug 11, 2020, 1:06 PM IST

Published : Aug 11, 2020, 1:06 PM IST

eambas-pictures-in-yadadri-sri-lakshmi-narasimha-temple
యాదాద్రి ఆలయ గోడలపై అద్భుతాల ఆవిష్కరణ

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయానికి ఎంబాస్ చిత్రాలు మరింత శోభను తేనున్నాయి. ఇప్పటికే యాదాద్రి ప్రధాన ఆలయ పనులు తుది దశకు చేరుకోగా... గోడలపై ఉబ్బెత్తుగా కనిపించే చిత్రాలు రూపుదిద్దుకునే పనులకు తాజాగా శ్రీకారం చుట్టారు.

యాదాద్రి ఆలయ గోడలపై అద్భుతాల ఆవిష్కరణ

దేవస్థానంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ ఎంబాస్ చిత్రాలు, భక్తులకు కనువిందు చేసేలా చెక్కుతున్నారు, గర్భాలయంలో స్వామి అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు, తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్లే మార్గంలో పాటు పలు నిర్మాణాలపై ఎంబాస్ శిల్పాలు రానున్నాయి. ఆలయానికి ఈ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. రాజగోపురంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామితో పాటు ఓ వైపు గరుత్మంతుడు, మరోవైపు ఆంజనేయస్వామి, గోపురంపై సుదర్శన చక్రం రూపంలో ఎంబాస్ చిత్రాలు చెక్కుతున్నారు.

ఇదీ చూడండి:పొరుగుసేవల ఏజెన్సీల ఎంపికలో నిబంధనల ఉల్లంఘన

ABOUT THE AUTHOR

...view details