తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా యాదాద్రిలో వసంతోత్సవ వేడుకలు - spring festival celebrations in Yadadri temple

కొవిడ్​ దృష్ట్యా యాదాద్రి పుణ్యక్షేత్రంలో వసంతోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ప్రత్యేక ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి బాలాలయంలో ఉరేగించారు.

yadadri, vasanthothsava festivities
యాదాద్రి, వసంతోత్సవ వేడుకలు

By

Published : Mar 29, 2021, 7:34 AM IST

పంచ నారసింహులుగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కరోనా కారణంగా వసంతోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ఆదివారం వసంతోత్సవాన్ని నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ప్రత్యేక ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ఆలయ అర్చకులు దివ్య మనోహరంగా అలంకరించారు.

అనంతరం బాలాలయంలో ఊరేగింపు చేపట్టి, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లంథిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:హోలీ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details