యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరా పనితీరును డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ సత్తయ్య, ఏఆర్ ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ రాజు పరిశీలించారు.
చౌటుప్పల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా - యాదాద్రి భువనగిరి జిల్లా లాక్‌డౌన్ వార్తలు
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు. డ్రోన్ కెమెరాలతో పట్టణాన్ని పరిశీలిస్తున్నారు.
చౌటుప్పల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా
రహదారుల వెంటనే కాకుండా, గల్లీల్లో భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా తిరిగే వారిని కూడా డ్రోన్ కెమెరా బంధిస్తుందని పోలీసులు తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని.. ఎవరు కూడా బాధ్యతరహితంగా తిరగకూడదని చెప్పారు.
ఇదీ చదవండి:నిర్బంధితులపై నిఘా... సమతూకమే కీలకం