యాదాద్రిని మహాదివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పర్వంలో పచ్చదనం పోషణలో ‘యాడా’ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. డ్రిప్ ఇరిగేషన్ విధానంతో హరి క్షేత్రాన్ని పచ్చదనంగా మార్చే ప్రక్రియను చేపట్టారు.
ఇప్పటికే 6 కి.మీ. దూరం గల రాయగిరి నుంచి రహదారులకు ఇరువైపులా మధ్యలోనూ వివిధ రకాల పూలు, ఆకర్షణీయ మొక్కలు, వృక్షాలను సంరక్షిస్తున్నారు. ఆలయ కొండకు దక్షిణ, పడమర దిశల్లోని పచ్చిక బయళ్లు, పూల మొక్కల పెంపకం చేపట్టారు. కొండ కింద పెద్దగుట్టపై ‘ఆలయ నగరి’ ఏర్పాటుకు లేఅవుట్ పనులు జరిగాయి.
యాదాద్రిలో పచ్చదనానికి డ్రిప్ ఇరిగేషన్ ఆహ్లాదకర వాతావరణం కోసం రకరకాల పుష్పాలు, పచ్చిక బయళ్లతో తీర్చిదిద్దారు. ఆయా ప్రాంగణాలలో హరితమయం పోషణ సజావుగా సాగేందుకు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అమలు పరిచేందుకు ఇటీవల సదరు పనులను చేపట్టారు. ఈ విధానంతో నీటి వినియోగం గణనీయంగా ఆదా కాగలదని ‘యాడా’ ప్రతినిధులు చెబుతున్నారు. డ్రిప్ విధానాన్ని క్షేత్రంలో చేపట్టిన గ్రీనరీ ప్రాంగణాలన్నింటా ప్రవేశపెట్టేందుకు రూ.3.5 కోట్లు నిధులు కేటాయించారు.
యాదాద్రిలో పచ్చదనానికి డ్రిప్ ఇరిగేషన్ ఇదీ చూడండి:రైతన్న పోరు: సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్