హైదరాబాద్ శివారులో డీఆర్‌ఐ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. 11.63 కోట్ల విలువైన 25 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గువాహటి నుంచి హైదరాబాద్‌కు కారులో పెద్ద మొత్తంలో బంగారం తరలుతున్నట్లు హైదరాబాద్ జోన్ డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద మకాం వేశారు. కారు రాగానే ఆపి సోదాలు నిర్వహించారు. కారులోని ముందువైపు సీటు వద్ద డాష్‌బోర్డు తొలిగించి దాచిన బంగారాన్ని గుర్తించారు. బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం జర్మనీ, యూరోప్‌లకు చెందినదిగా అధికారులు గుర్తించారు. కారుతోపాటు అందులోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
రూ.11.63 కోట్ల విలువైన బంగారం బిస్కట్లు స్వాధీనం - telangana varthalu
హైదరాబాద్ నగర శివారులో డీఆర్‌ఐ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.11.63 కోట్లు విలువైన 25 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేయడంతోపాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని అరెస్టు చేసిన డీఆర్‌ఐ అధికారులు...ఆ బంగారం ఇక్కడ ఎవరికి చేరవేసేందుకు తెచ్చారన్న విషయమై ఆరా తీస్తున్నారు.
పట్టుబడిన ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని... మయన్మార్ నుంచి గువాహటికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ మీదుగా ఈ బంగారాన్ని స్మగ్లర్లు భారత్‌లోకి తీసుకొచ్చారని... ఇక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ దుకాణదారుడికి చేరవేసేందుకు రోడ్డు మార్గాన తెస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఏ దుకాణానికి చేరవేసేందుకు తెచ్చారన్న విషయమై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: రూ.11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్వాధీనం