యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో ఓ ముస్లిం వ్యక్తి దశాబ్ద కాలంగా చికెన్ షాపు నడుపుతున్నాడు. దేశంలో ఒక్క సారిగా దిల్లీలోని మర్కజ్ ప్రార్థనల కారణంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతను కూడా వెళ్లి వచ్చాడంటూ, అతనికి కరోనా ఉందంటూ, అతని దుకాణం వద్ద చిెకన్ కొనొద్దంటూ ప్రచారం జోరుగా సాగింది.
ఆ చికెన్ షాపులో కొనొద్దు వైరస్ ఉంది! - yadadri bhuvanagiri district latest news today
కరోనా వైరస్ ఉంది.. ఆ షాపు యజమాని వద్ద చికెన్ కొనొద్డంటూ ఓ వ్యక్తి గ్రామం మొత్తం ప్రచారం చేశాడు. ఈ నేపథ్యంలో ఆ దుకాణం యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఆ గ్రామానికి పోలీసులు చేరుకుని ప్రజలకు నచ్చజెప్పారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ చికన్ షాపులో కొనద్దు వైరస్ ఉంది!
అతని షాపు వద్దకు ఎవరూ రాకపోవడం వల్ల తప్పుడు ప్రచారంపై పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన నారాయణాపురం ఎస్ఐ నాగరాజు అక్కడకు వెళ్లి ప్రజలకు నచ్చజెప్పారు. ఆ ప్రార్థనలకు ఎవరూ వెళ్లలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :తొలి కరోనా కేసుతో అధికారులు అప్రమత్తం