తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు సంక్షేమంలో ఆదర్శం: ఎమ్మెల్యే పైళ్ల - భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పర్యటన

రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో.. రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి పీఏసీఎస్‌ పరిధిలో తొలివిడతగా రుణమాఫీ పొందిన రైతులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం రంజాన్ మాసం పురస్కరించుకుని.. ముస్లిం సోదరులకు సరకులను అందజేశారు.

Distribution of Loan Documents for the First Time Loan Farmers under Bhuvanagiri PACS
రైతు సంక్షేమంలో ఆదర్శం: ఎమ్మెల్యే పైళ్ల

By

Published : May 21, 2020, 11:20 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త మున్సిపల్ ఆఫీస్ లో పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్ పంపిణీ చేశారు. అనంతరం ఇండోర్ స్టేడియం వద్ద నూతనంగా నిర్మిస్తున్న పార్కు , సిమ్మింగ్ ఫూల్ స్థలాన్ని ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.

రంజాన్ మాసం పురస్కరించుకుని.. ముస్లిం సోదరులకు 15 కేజీల బియ్యం, నిత్యావసర సరకులను ఎమ్మెల్యే అందజేశారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి పీఏసీఎస్‌ పరిధిలో తొలివిడతగా రుణమాఫీ పొందిన రైతులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details